అమెరికాలో గతంలో కొన్ని షోలు నిర్వహించిన లక్ష్మీ మంచు తెలుగులో మొదటిసారిగా లక్ష్మీ టాక్ షో తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిర్మాతగా, నటిగా, టీవీ హోస్ట్ గా తనదైన శైలిలో అలరించే మంచు వారి అమ్మాయి లక్ష్మీ మంచు అమెరికన్ యాక్సెంట్ తో మాట్లాడే తెలుగుకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత లక్కుంటే లక్ష్మి అనే షోతో కూడా ఆమె కనిపించారు. ప్రస్తుతం మేము సైతం, మహారాణి వంటి షోలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆమె డిజిటల్ ప్లాట్ ఫార్మ్ పై కూడా దృష్టి పెట్టారు. ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ పేరుతో వూట్ సంస్థ కొరకు ఓ రియాలిటీ షో నిర్వహించనున్నారు. అయితే ఆమెకు తాజాగా ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురయింది. ‘ఇంతటి సక్సెస్ఫుల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మీరు బిగ్ బాస్ హోస్ట్ గా ఎందుకు చేయరు?’ అనే ప్రశ్న ఆమెకు ఎదురయింది. దీనితో ఆమె స్పందిస్తూ.. ‘బిగ్బాస్ రెండవ సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాని ఎంతో అద్భుతంగా చేశారు. అయినప్పటికీ ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అలాంటి నెగెటివిటీ పేస్ చేయడం నావల్ల కాదు. అందుకే బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నాను’ అన్నారు.