ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైరా తో పోటీకి సై అంటున్నచాణక్య..!

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2019, 12:43 AM



గోపీచంద్ హీరోగా మేహరీన్ కధానాయకగా తిరు దర్శకత్వంలో పీకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం చాణక్య. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా ప్రేకషకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాదు సినిమాలోని గొపీచంద్ సరికొత్త స్టయిల్, యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే ఈ సినిమాపై కూడా ప్రేక్షకులకి అంచనాలు పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5వ తేదిన రిలీజ్ చేయబోతున్నారన్న వార్త తెగ ప్రచారం అవుతుంది. అయితే మెగస్టార్ చిరు నటిస్తున్న సైరా సినిమా విడుదలైన మూడు రోజులకే ఈ చిత్రం కనుక విడుదల చేస్తే సైరా ధాటిని తట్టుకుని చాణక్య నిలబడగలదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఒకవేళ సైరాకి పోటీగా వెళితే అది నిజంగా సాహసమేనని, చాణక్య సినిమాపై మేకర్స్ కూడా పక్కా కాన్‌ఫిడెంట్‌గానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ ఈ సినిమ అక్టోబర్ 5వ తేదినే రిలీజ్ అయితే సైరాకి కాస్తంతయినా పోటీ ఇస్తుందా లేదా అనేదానిపై వేచి చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com