టాలీవుట్ స్టార్లెట్ లక్ష్మీ మంచు ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్ తెలుగు’ లో హోస్ట్ చేస్తున్న విషయం విదితమే. నిన్న ఆమె లైవ్లీ, కరిష్మాటిక్ సినీ హీరో వరుణ్ తేజ్ ముచ్చట్లకు సంబంధించి అనేక అంశాలు బైటకు తీసుకువచ్చారామె. వరుణ్ తేజ్ తన లో దాగిన కెమెరా ముందు డైనమిజాన్ని బయటపెడతారు... కానీ బైట మాత్రం సిగ్గుపడిపోతారంటూ లక్ష్మీ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం ఇవ్వటంతో మంచువారమ్మాయి కరిగిపోయింది. ఈ తాజా ఫీట్ అప్ విత్ ది స్టార్స్ తెలుగు’ మనోరంజక చాట్ షో లో వరుణ్ కు లక్ష్మి రకరకాల ప్రశ్నలు వేయటం తదితర అంశాలపై జరిగిన షూటింగ్లో చంపడానికి, పెళ్ళి చేసుకునేందుకు, హుక్ అప్ కోసం...సాయి పల్లవిలో, రాశి ఖన్నా, పూజా హెగ్డేలలో ఎవరిని ఎంచుకుంటారని లక్ష్మి ప్రశ్నించడం పూర్తి కాకుండానే వరుణ్ వెంటనే ఎంతో అందుకుని. ‘చంపేది – రాశి ఖన్నా, తిరిగేది – పూజా హెగ్డే, పెళ్ళాడేది – సాయి పల్లవి’ ఆత్మవిశ్వాసంతో ...అని బదులివ్వడం కార్యక్రమాన్ని మరింత హుషారెక్కించింది.
వరుణ్ మొదటి సినిమా ముకుంద లో ఆయన సరసన నటించింది పూజా హెగ్డే. రొటీన్ కు భిన్నంగా జరిగే చాట్ షో ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్ తెలుగు’ తాజా ఎపిసోడ్ అనేక అంశాలపై లక్ష్మి-వరుణ్‌ల నడుమ చర్చజరిగింది.