విడుదలకు ముందు రోజు వాల్మీకి కాస్త గద్దలకొండ గణేష్ గా మారినా హిట్ టాక్ అందుకుంది. అయితే ఈ మార్పుకు ప్రధాన కారణం వైసీపీ ఎంపీ హస్తం ఉందని కథనాలు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఫ్యాక్షన్ సినిమా అని దీనికి వాల్మీకి టైటిల్ పెట్టడం ఏంటంటూ తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా బోయ సంఘాలు, వాల్మీకి కులస్తులు నిరసనలు, ధర్నాలు చేపట్టారు. రాస్తారోకోలు చేసారు. ధియేటర్లులో సినిమా ప్రదర్శననని అడ్డుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసారు.
చివరని వాల్మీకి వంశీయుడైన వైసీపీ ఎంపీ తలారి రంగయ్యకు ఫిర్యాదు చేసారు. దీంతో పాటు మరికొందరు కోర్టుని ఆశ్రయించారు. దీనిపై కోర్టు నిర్మాత, దర్శకులు వివరన ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. మరోవైపు విడుదలకు సమయం దగ్గర పడటంతో పాటు నిర్మాత దర్శకులపై వచ్చిన వత్తిళ్లే సినిమా పేరుమార్పుకు సై అనాల్సి వచ్చిందట. వైసిపి రంగయ్య కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ను కలిసి పరిస్థితి వివరించడంతో పై నుంచి వత్తిడే కారణమని వినిపిస్తోంది. ఈ కారణంగా వాల్మీకి కాస్త గద్దలకొండ గణేష్ గా మారిపోయింది. కానీ చివరి నిమిషంలో సినిమా టైటిల్ మార్పుపై డైరెక్టర్ హరీష్ శంకర్ కన్నీరు పెట్టుకోగా... మెగా అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఏది ఏమైనా అయిన కూడా హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లు సాధిస్తోంది వాల్మీకిగా మారిన గద్దలకొండ గణేష్.