తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ దక్షిణాదిగా అభిమానులను సంపాదించుకున్న అగ్ర తార కాజల్ అగర్వాల్. ఎప్పుడు సినిమా షూటింగ్ లో బిజి బిజిగా ఉంటె కాజల్ తీరిక సమయం దొరికితే అభిమానుతో సోషల్ మీడియాలో చాట్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల తన అభిమానులతో చాటింగ్ చేస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చింది. ఆ సమయంలో కాజల్‌ను ఓ అభిమాని.. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, మీరు ఒకే చెబితే వివాహం చేసుకుంటానని చాట్ చేశాడు. దీంతో అవాక్కైన కాజల్ కొంతసేపటి తరువాత తేరుకుని ‘ప్రయత్నించండి. అయితే అది అంత ఈజీ కాదు’ అని సమాధానం ఇచ్చింది. అందుకు ఆనందపడిపోయిన ఆ అభిమాని ప్రయత్నిస్తానని తిరిగి సమాధానమిచ్చాడు.