ఆర్ఎక్స్ 100, హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్ వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో కార్తికేయ. తాజాగా శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న “90ఎం.ఎల్” లో నటిస్తున్నాడు. ఈసినిమాలో ఆథరైజ్డ్ డ్రింకర్గా ఎలా దేవదాసు పాత్రలో కనిపించనున్నాడు. డ్రింకర్ ఎందుకు అయ్యాడన్నదే ఈ చిత్ర కథ. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి “ఇన్పించుకోరా…” అనే లిరికల్ వీడియోస్ ఒంగ్ ను విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు సామాజిక మీడియాలో అదరగొడుతోంది.