నే విస్కీని ఇష్టపడతానంటూ శృతి హాసన్ చెప్పినట్టు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యింది. ఎంతలా అంటే శృతి హాసన్ ఒకప్పుడు బాగా తాగేదట.. ఆమె పూర్తిగా ఒక ఆల్కహాలిక్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ విమర్శలకు స్పందించిన శృతి... ఆ టాక్ షో లో నేను ప్రస్తుతం నేను ఆల్కహాల్ తీసుకోవడం లేదని.. ప్రశాంతమైన ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నట్లుగా చెప్పానని కానీ... ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు నా వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేసారు.
ఈ రోజుల్లో డ్రింకింగ్ అనేది చాలా సర్వసాధారణమైనదని, డ్రింకింగ్ అనేది ఇప్పుడు ప్రతిష్టను దెబ్బ తీసేది ఏమీ లేదని 2019వ సంవత్సరంలో ఉండి కూడా మనం ఇంకా మద్యం విషయంలో రహస్యాన్ని పాటించడం అనేది హాస్యాస్పదం అంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది. నా గురించి మరెవ్వరు కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని, చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.