ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రచయితల సంఘం రజతోత్సవ వేడుక టీజర్‌ ఆవిష్కరణ

cinema |  PTI  | Published : Sun, Oct 20, 2019, 01:03 AM



 రచయితల సంఘమంటే సరస్వతీ పుత్రుల సంఘమని అలాంటి సరస్వతీ పుత్రుల సంఘం లక్ష్మీ దేవి కటాక్షం తో అద్భుతమైన స్వ0త భవనం కట్టుకునేలా అభివృద్ధి చెందాలని రెబల్ స్టార్ కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు
శనివారం  ఫిలింనగర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో జరిగిన తెలుగు సినీ రచయితల సంఘ రజతోత్సవ వేడుకల టీజర్ లాంచింగ్ కోసం జరిగిన పత్రికా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.... 'నాన్నగారు ఓ మాట చెప్పేవారు. లక్ష్మీ ఎదురువస్తే నమస్కరించు. కానీ సరస్వతి ఎక్కడున్నా వెతికి వెతికి నమస్కరించు. అందుకే రచయితల వేడుకకు వచ్చానని అన్నారు.  రచయితలకు కాన్‌సన్‌ట్రేషన్‌, అంకితభావం వుండాలి. అలా ఎంతోమంది పెద్దలున్నారు. ప్రస్తుతం కాలంతోపాటు రచనల్లో మార్పు వచ్చింది. దానికి అనుగుణంగానే రచయితలు వుంటారు. పిల్లలకు మనం చెబితే దాన్నే ఆచరిస్తారు. అదేవిధంగా రచయితలు రాసిన మాటలే ప్రేక్షకులు పాపులర్‌ అవుతాయి. మంచి మార్గంలో దోహదపడేలా వుండాలి. నేను చాలా పెద్ద పెద్ద మహానుభావులతో పని చేశాను. ఆత్రేయగారు ఏదన్నా సీన్‌ రాసే ముందు ఆయన ఆ క్యారెక్ట్‌లోకి వెళ్లిపోయి డైలాగ్‌లు రాస్తారు. అందరూ రాస్తారు కాని నువ్వు రాసిందికాదు ఉచ్చరించేది అనేవాడ్ని. రచయితలు మహానుభావులు వంటివారని పేర్కొన్నారు.తానూ రచయితల సంఘం సభ్యుడినని తనతండ్రి సరస్వతీ దేవి కోసం మనమే వెదుక్కుంటూ వెళ్లాలని చెప్పేవారని అన్నారు.
కార్యక్రమం బలభద్రపాత్రుని రమణి స్వాగతం తో ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు సంఘం తొలినాటి విశేషాలను వివరించారు. అధ్యక్షుడు డా. పరుచూరి గోపాలకృష్ణ సంఘ కార్యకలాపాలు, నవంబసురు మూడున ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరగబోతున్న రచయిత ల సంఘ రజతోత్సవ విశేషాలని వివరించారు. అగ్ర రచయితలు దశాబ్దాల వారీగా తెలుగు సినీమా రచనల గూర్చి రచయిత ల గొప్పదనం గూర్చి ప్రసంగించారు.
ముందుగా పలువురు అగ్ర రచయితలు పాల్గొని 1932 దశకం నుంచి ఈ దశకం వరకు తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం సినీ రచయితల కృషిని  గుర్తుచేసుకున్నారు.
నవంబర్‌3న రచయిత సంఘం రజతోత్సవ వేడుక జరగనున్న   సందర్భంగా కర్టెన్‌ రైజర్‌గా వేడుకు సంబంధించిన టీజర్‌ను కృష్ణంరాజు ఆవిష్కరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com