నటరాజ్ , నూరిన్ , అంకిత హీరో, హీరోయిన్లు గా రూపొందుతున్న “ఊల్లాల ఊల్లాల” . ఈ చిత్రం ద్వారా దర్శకుని గా సీనియర్ నటుడు ‘సత్య ప్రకాష్” పరిచయమవుతున్నారు.. సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ . గురురాజ్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ చిత్రం నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా ఈ చిత్రం లో ఒక పాట పాడటంతో పాటు నటించింది కూడా.
ఈ సందర్భంగా నిర్మాత ఏ . గురురాజ్ మాట్లాడుతూ.. “మంగ్లీ” కి తెలుగు నాట మంచిపాపులారిటీ ఉంది. ఆమె మా సినిమాలో ఓ పాటపాడడంతో పాటు, ఆ పాటలో నటించారు కూడా. అలాగే హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ చెప్పింది. ఓ రకంగా మంగ్లీ మా సినిమా లో స్పెషల్ ఎట్రాక్షన్ గానిలువనుందని అన్నారు.