త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీ పంచ్ లతో పాటుగా.. హీరోయిన్స్ కి ఏదో ఒక వీక్ నెస్(లోపం) ఉండడం గమనిస్తూనే ఉన్నాం. జల్సా సినిమాలో ఇలియానా ని... ఇక జులాయి సినిమాలోనూ ఇలియానా కి తింగరి తనం ఎక్కువ, తెలివితేటలు తక్కువ. అంతేనా సన్నాఫ్ కృష్ణమూర్తి లోను సమంత ని హాట్ గా గ్లామర్ గా చూపిస్తూనే ఆమెకి డయాబెటిస్ వ్యాధి ఉందని అందుకే చక్లెట్స్ తింటూ అమాయకంగా ఉండేలా చూపించాడు. ఇక త్రివిక్రమ్ మొదటి డిజాస్టర్ అజ్ఞాతవాసి సినిమాలో హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మన్యువల్ కి అసలు మెదడు ఉందో.. లేదో.. అనే డౌట్ కొట్టే తెలివితేటలు ఉంటాయి. అలా వైకుంఠపురములో పూజ హెగ్డే ని ఎలా చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటీ మొదలైంది. పూజ ని పూజలాగే అందంగా చూపిస్తాడో లేదంటే... మరేదన్న లోపాన్ని పూజకి త్రివిక్రమ్ తగిలిస్తాడో చూడాలి.