సినిమా విషయంలో బాలయ్య డెడికేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే బోయపాటి తన సినిమా కోసం బాలయ్య ను వెయిట్ తగ్గమని చెప్పడంతో ఆయన ప్రతిరోజు గంటలబడి వర్కవుట్స్ చేస్తున్నారట. ప్రత్యేకంగా ఫిట్ నెస్ నిపుణుడ్ని నియమించుకుని డైట్ కంట్రోల్ పాటిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య కు 10 కిలోల వరకు తగ్గాలనేది టార్గెట్. ఇక ఇందులో బాలయ్య లుక్ పూర్తిగా భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బోయపాటి. ఇందుకోసం బోయ డిసెంబర్ లో బాలయ్య కు లుక్ టెస్ట్ చేయనున్నాడు. అన్ని ఓకే అనుకుంటే జనవరి నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు.