ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోగా రానున్న ‘దగ్గుబాటి అభిరామ్’

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 03:30 PM



నటుడు రానా సోదరుడు హీరోగా రంగప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నాడు. రానా తమ్ముడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేయడానికి కొంతమంది దర్శక నిర్మాతలు ఇంతకుముందే ఉత్సాహాన్ని చూపారు. అయితే అందుకు సరైన సమయం రాలేదంటూ సురేశ్ బాబు వాయిదావేస్తూ వచ్చారు. మరో వైపున ఆయన అభిరామ్ కి ముంబైలో నటనతో పాటు డాన్స్ .. ఫైట్స్ .. హార్స్ రైడింగ్ తదితర విషయాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారట. అభిరామ్ శిక్షణ పూర్తవుతూ ఉండటంతో, అతని కోసం సురేశ్ బాబు కథలు వింటున్నారని సమాచారం. మంచి కథ దొరికితే సొంత బ్యానర్ లో  సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని ఫిల్మ్ నగర్ టాక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com