‘మొహంజోదారో’ సినిమా విఫలం కావడం వల్లే బాలీవుడ్లో మీకు అవకాశాలు తగ్గాయా అన్న ప్రశ్నను నటి పూజాహెగ్డే ముందు ఉంచితే…‘‘ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారీ చెబుతూనే ఉన్నాను. ఈ సినిమా చేసినందుకు పశ్చాత్తాపం లేదు. అప్పట్లో ఈ సినిమా చేయాలని నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఇప్పటికీ నమ్ముతున్నాను. నా తొలి హిందీ సినిమాలోనే హృతిక్‌రోషన్ వంటి స్టార్ హీరోతో కలిసి నటించినందుకు సంతోషంగా ఉంది. ఇక సినిమా ఫలితం అన్నది నటీనటుల చేతుల్లో ఉండదు. ప్రేక్షకులు నిర్ణయిస్తారు. నేను నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుందనే నమ్మకం ఉందని చెప్పింది.