ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ప్రేమకి ధన్యవాదాలు

cinema |   | Published : Mon, Oct 21, 2019, 04:38 PM



‘అల‌.. వైకుంఠ‌పుర‌ములో’ సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించాడు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి సామ‌జవ‌ర‌గ‌మ‌నా.. అనే సాంగ్ విడుద‌లైంది. క్లాసికల్ మ్యూజిక్ కి వెస్ట్రన్ టచ్ ఇచ్చి థమన్ స్వరపర‌చిన‌ ఈ సాంగ్ ప్రేక్షకులకు అమితంగా నచ్చేసింది. యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 41 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకున్న ఈ పాట 7లక్షల లైక్స్ ను యూట్యూబ్ లో దక్కించుకుంది. తెలుగులో ఓ పాట‌కి ఇన్ని లైక్స్ రావ‌డం ఇదే తొలిసారి. ఈ విష‌యాన్ని ఈ చిత్ర హీరో అల్లు అర్జున్ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. ఎక్కువ మంది లైక్ చేసిన తెలుగు పాట ఇది. మీ ప్రేమ‌కి ధ‌న్యవాదాలు అని పోస్ట్ పెట్టాడు బ‌న్నీ. సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాట‌కి తగిన న్యాయం చేసాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. త్రివిక్రమ్ దర్శకుడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com