ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత సినీ పరిశ్రమలో ఉన్న నటుల్లో ఉత్తమ నటుడు

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 05:04 PM



భారతీయుడు-2లో నటి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. శంకర్ -కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇటీవలే రకుల్ జాతీయ మీడియాతో చిట్ చాట్ లో పలు విషయాలు షేర్ చేసుకుంది. కమల్ హాసన్ భారత సినీ పరిశ్రమలో ఉన్న నటుల్లో ఉత్తమ నటుడని తెలిపింది. నాకు తెలిసినంత వరకు సినిమాల్లో కమల్ హాసన్ పోషించిన పాత్రలు ఎవరూ చేయలేదు. అలాంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. శంకర్-కమల్ క్రేజీ కలయికలో మరోసారి వస్తోన్న భారతీయుడు-2లో నటించడం చాలా హ్యాపీగా ఉందని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com