ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘రాజుగారి గది 3’ మూడు రోజుల్లో 3.5కోట్ల షేర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 07:58 PM



హార్రర్ ..కామెడీగా ఈ నెల 18వ తేదీన  ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘రాజుగారి గది 3’. ఈ చిత్రం  ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీలో అశ్విన్ బాబు..అవికాగోర్ ముఖ్య పాత్రలు పోషించారు.  తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 3.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఈ సినిమాకి అయిన బడ్జెట్ .. అమ్మకాలను బట్టి చూస్తే, లాభాల బాట పట్టడానికి మరికొన్ని రోజులు థియేటర్స్ లో నిలబడవలసి ఉంటుంది. ఈ వారంలో ఈ సినిమాకి పోటీగా నిలిచే తెలుగు సినిమాలు కూడా ఏమీ లేవు. తమిళ సినిమాలైన ‘బిజిల్’ .. ‘ఖైదీ’ సినిమాలు మాత్రం రంగంలోకి దిగులుతున్నాయి. విజయ్ హీరోగా రూపొందిన ‘బిజిల్’ పై .. కార్తీ హీరోగా చేసిన ‘ఖైదీ’పై అందరిలోనూ ఆసక్తి వుంది. ఈ రెండు సినిమాలను కూడా ఈ నెల 25న వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. మరి ఈ పోటీని ‘రాజుగారి గది 3’ ఎంతవరకూ తట్టుకుని నిలబడుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com