ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజుగారి గది 3 స‌క్స‌స్ మీట్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2019, 02:22 AM



 రాజుగారి గది 3 విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ స‌క్స‌స్ మీట్ నిర్వ‌హించింది.  ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ…నా తమ్ముడు అశ్విన్ ను యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ అందరికి ధన్యవాదాలు. ప్రేక్షుకుల సపోర్ట్ ఉంటే ఎవ్వరూ ఎక్కడికైనా వెళుతారు. వైజాగ్ మెలోడీ థియేటర్ లో పెద్ద హీరో షోస్ కు మాత్రమే ఫుల్ అవుతుంటాయి. కానీ మా రాజు గారి గది 3 ఫుల్స్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా బాగా ఆధరిస్తారని భావిస్తున్నాను. ఈ సినిమాకోసం పని చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.


ఆలీ మాట్లాడుతూ..రాజు గారి గది 3 ను బాగా రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ కు థాంక్స్. ఈ సినిమాను అందరూ కష్టపడి పని చెయ్యడంతోనే ఈ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రం నేను కూకట్ పల్లిలో చూడ్డం జరిగింది. ఆడియన్స్ సినిమాను నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకుకు ఆదరిస్తున్నారు, వారి సపోర్ట్ చాలు ఈ చిత్రం విజయం సాధించడానికి అన్నారు.


అశ్విన్ మాట్లాడుతూ…సినిమా చెయ్యాలనే ఆసక్తే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. నాకు ఈ సినిమాతో ఒక మార్కెట్ ఓపెన్ అయ్యిందని ఫ్రెండ్స్ చెబుతున్నారు, అందుకు సంతోషం. సినిమా చూసిన ప్రతివక్కరు బాగుందని చెబుతున్నారు. బుక్ మై షో రేటింగ్స్ ను చూసి నేను బాధ పడ్డాను. బుక్ మై షో వారు అందరి రేటింగ్స్ ను పరిగణలోకి తీసుకుని రేటింగ్స్ ఇస్తే బాగుండేది. వారు కేవలం నెగిటివ్ రేటింగ్స్ తీసుకొని పెడుతున్నారు. నేను, అవికా థియేటర్స్ విజిట్ చేశాము, రెస్పాన్స్ చేస్తుంటే అద్భుతంగా ఉంది. సినిమా చూసిన ప్రేక్షకులను అడిగి వారి ఫీడ్ బ్యాక్ తీసుకొని సినిమా చూడమని ప్రేక్షకులను కోరారు.


హీరోయిన్ అవికా గోర్ మాట్లాడుతూ.. థియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ సూపర్బ్ గా ఉంది. నన్ను తెలుగులో ఇంతబాగా ఆధారిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు మా చిత్ర యూనిట్ అందరికి అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com