చిలసౌ తో హిట్ కొట్టిన అక్కినేని కుర్రాడు సుశాంత్ ఇప్పుడు అలా వైకుంఠపురములో ఓ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆదివారం సుశాంత్ లుక్ ఒకటి బయటికొచ్చింది. ఆ లుక్ లో సుశాంత్ కాస్త స్టైలిష్ గా.. ఏ సాఫ్ట్ వెర్ జాబో చేస్తున్నవాడి లుక్ లా ఉంది. మరి హీరోగా కాస్త ఫామ్ లోకొచ్చిన సుశాంత్ కి త్రివిక్రమ్ ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చాడో అని అక్కనేని ఫాన్స్ కి టెన్షన్ పట్టుకుంది. ఇక సుశాంత్ రోల్ పాజిటివ్ గా ఉంటుందా? లేదంటే నెగెటివ్ గా ఉంటుందా? అనేది ఇంకా ఎక్కడా రివీల్ కాలేదు. మరి ఈ సినిమా హిట్ సంగతేమో కానీ.... సుశాంత్ ఆటలో అరటిపండు కాకుంటే చాలు.