విజయ్ దేవరకొండ హీరో సినిమా షూటింగ్ సగంలో ఆగిపోయిందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. కారణాలు యేవో కానీ మూవీ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్రం యూనిట్ కూడా ఎక్కడ స్పందించలేదు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇవ్వని ఒట్టి పుకార్లు మాత్రమేనని తెలుస్తోంది. సినిమా ఆగిపోలేదని తెలుస్తుంది. నవంబర్ లో కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈమూవీ కోసం విజయ్ అంతర్జాతీయ స్థాయి రోడ్ రేసింగ్ ఛాంపియన్ అయిన రజిని కృష్ణన్ వద్ద కొన్నిరోజులు శిక్షణ తీసుకున్నాడు.