రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అమృత రామమ్’. సురేందర్ కొంటాడ్డి దర్శకుడు. దేర్ ఈజ్ నో లవ్ విత్ ఔట్ పెయిన్ అనేది ఉప శీర్షిక. యస్.ఎన్.రెడ్డి నిర్మాత. ఒక గాఢమైన ప్రేమకథగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.ప్రేమలోని గాఢతను ఈ కథలో చెప్పబోతున్నాం. పాటలు హైలెట్‌గా ఉంటాయి అని చిత్ర దర్శకుడు తెలిపారు. ఎన్ఎస్. ప్రసు అందించిన స్వరాలు ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అని చెప్పారు.