మ‌హేశ్ కోసం స్పెష‌ల్ క‌సరత్తులు

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 12:26 PM

సూప‌ర్‌స్టార్ లేటెస్ట్ మూవీ `స‌రిలేరు నీకెవ్వ‌రు` సెట్స్‌పై ఉంది. రామోజీ ఫిలింసిటీలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ప్ర్య‌తేకంగా వేసిన కొండారెడ్డి బురుజు సెంట‌ర్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్‌సాంగ్‌లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మ‌హేశ్‌తో క‌లిసి చిందేయ‌నున్నారు. ఇది వ‌ర‌కు వీరిద్ద‌రూ క‌లిసి `ఆగ‌డు` చిత్రంలో జంట‌గా న‌టించారు. అయితే ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డం ఇదే ప్ర‌థ‌మం. అయితే ఇలాంటి మాస్ మ‌సాలా సాంగ్‌లో స్టెప్పేసి చాలా కాల‌మైంది కాబ‌ట్టి తాను కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని త‌మ‌న్నా కూడా తెలిపింది. ఇప్ప‌టికే ఈ సాంగ్ కోసం దేవి ఓ ట్యూన్‌ను సిద్ధం చేశాడ‌ట‌. స్పెష‌ల్ సెట్‌లోనే ఈ స్పెష‌ల్ సాంగ్‌ను చిత్రీక‌రించ‌నున్నారు.Recent Post