జపాన్‌లో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు....

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 12:29 PM

‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్ దేశంలో. ‘బాహుబలి’కి ఇండియాలో ఎంత ఆదరణ దక్కిందో జపాన్‌లో కూడా అంతే ఆదరణ దక్కింది. అంతేకాదు అక్కడ ప్రభాస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఆయనంటే అమితంగా ఇష్టపడే అభిమానులు ఉన్నారు. వారంతా ప్రభాస్ పుట్టినరోజును సెలబ్రేట్ చేయడానికి సిద్దమయ్యారు. రేపు 23న రెబల్ స్టార్ 40వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్బంగా జపాన్‌లోని ప్రముఖ నగరాలైన టోక్యో, ఒసాకాలలో ఈరోజు పుట్టినరోజు వేడుకలను భారీగా నిర్వహించనున్నారు స్థానిక అభిమానులు. ఇకపోతే ప్రభాస్ ఈసారి బర్త్ డేను స్నేహితులతో కలిసి విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకోనున్నారు.
Recent Post