పాయల్ రాకతో అక్కడి రోడ్లు జనసంద్రంగా

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 12:32 PM

జయాపజయాలతో సంబంధం లేకుండా పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె టాలీవుడ్ లో చేసిన మూవీస్ తక్కువే అయినా యూత్ లో ఆమెకున్న క్రేజ్ తగ్గడం లేదు. మొదటి చిత్రం ఆర్ ఎక్స్ 100 తో వచ్చిన పాపులారిటీ మరియు ఇమేజ్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఆర్డీఎక్స్ లవ్ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించారు, ఆ మూవీ అంతగా విజయం సాధించక పోయినా, పాయల్ గ్లామర్ కి మరియు నటనకి మంచి పేరే వచ్చింది.


కాగా నేడు హైదరాబాద్ లో ఒక మొబైల్ స్టోర్ ఓపెనింగ్ కి వెళ్లిన పాయల్ కి అభిమానుల నుండి ఘనస్వాగతం లభించింది. ఆమె రాకను తెలుసుకున్న అభిమానులు ఉదయం నుండే ఆమె కొరకు ఎదురుచూశారు. పాయల్ రాకతో అక్కడి రోడ్లు జనసంద్రంగా మారిపోయాయట. దిల్ సుఖ్ నగర్ లోని టచ్ మొబైల్స్ స్టోర్స్ ఓపెనింగ్ కొరకు వెళ్లిన పాయల్ ఇలాంటి అభిమానాన్ని చూసి మురిసిపోయారట. ఇక పాయల్ ప్రస్తుతం టాలీవుడ్ లో వెంకీ మామ, డిస్కోరాజా చిత్రాలలో నటిస్తున్నారు.
Recent Post