'ఆర్ ఆర్ ఆర్' మూవీ లేటెస్ట్ అప్డేట్...!

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 12:38 PM

నేడు నైజాం ఉద్యమ వీరుడు కొమరం భీం జయంతి నేడు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో తారక్ కొమరం భీం గా నటిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ లుక్ కి సంబందించిన ఏదైనా అప్డేట్ ఇస్తారని అందరూ గతంలో భావించారు. కానీ ఆర్ ఆర్ ఆర్ నుండి ఇప్పట్లో ఎటువంటి అప్డేట్ ఉందని అర్థం అవుతుంది. మూవీ విడుదలకు ఇంకా చాలా సమయం ఉండటంతో ఇప్పుడే హీరోల లుక్స్ రివీల్ చేయడం మంచి కాదనే భావనలో జక్కన్న ఉన్నారు. ఎన్టీఆర్ పూర్తి లుక్ కాకపోయినా ఆర్ ఆర్ ఆర్ మూవీపై ఎదో ఒక అప్డేట్ ఉంటుందని ఆశపడ్డారు కొందరు సినీ ప్రేమికులు. కానీ అలాంటివేమీ లేవని అర్థం అవుతుంది. ప్రస్తుతం రాజమౌళి లండన్ లో ఉన్నారు. ఆయన రాయల్ అల్బర్ థియేటర్ లో బాహుబలి ప్రదర్శన సందర్భంగా ప్రభాస్, అనుష్క, రానా లతో కలిసివెళ్లారు. ఆయన ఇంకా లండన్ లోనే ఉన్నట్లు సమాచారం. ఇక ఆర్ ఆర్ ఆర్ బల్గెరియా షెడ్యూల్ పూర్తయినట్లు తెలుస్తుంది. తాజా షెడ్యూల్ త్వరలోనే మొదలయ్యే అవకాశం కలదు.
Recent Post