మళ్ళీ అత్త పాత్రలో కనపడనున్న రమ్యకృష్ణ

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 12:43 PM

ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా సినిమా 'రొమాంటిక్'. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రమ్యకృష్ణ, ఆకాష్ పూరి తల్లి పాత్రలో నటిస్తోందని ఇటీవలే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న కేతిక శర్మకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోందట. అంటే సినిమాలో ఆకాష్ పూరికి రమ్యకృష్ణ అత్తగా కనిపించబోతుంది అన్నమాట.
Recent Post