బిగ్ బాస్: బలప్రదర్శనగా మారిన టాస్క్...

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 12:48 PM

నిన్నటి ఎపీసోడ్‌లో అలీ, శివజ్యోతిలకు అరటిపండ్ల టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో ఎవరైతే ఎక్కువ అరటిపళ్లు తింటారో వారికి బేటరీ రీఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఈ టాస్క్‌లో అలీ నెగ్గి.. బేటరీ లైఫ్ పెంచుకున్నారు. మరో వైపు వరుణ్, రాహుల్‌లకు ఇచ్చిన టాస్క్‌లో ఇద్దరి మధ్య కొంత ఫిజికల్ అయ్యి హింసాత్మకంగా మారింది. ఈ టాస్క్‌లో ఎవరి బ్యాగ్ లో థెర్మోకోల్ బాల్స్ ఎక్కువ ఉంటాయో వారే గెలిచినట్లు బిగ్ బాస్ చెప్పారు. దీంతో రెచ్చిపోయిన రాహుల్, వరుణ్ ఒకరితో మరొకరు ఫిజికల్‌గా ఎటాక్ చేసుకుంటు కిందపడి టాస్క్‌లో గెలవడానికి ప్రయత్నించారు. ఈ టాస్క్‌లో రాహుల్ గెలిచాడు. కాగా మరోటాస్క్‌  బాబా భాస్కర్, అలీ రెజాలకు పడింది. ఈ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన మట్టి పెట్టెలో పూలను నాటాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఇద్దరూ పూల చెట్లను నాటే క్రమంలో ముందుగా బాబా భాస్కర్ పూలను అలీ లాగి విసిరేశాడు. దీంతో అలీ పూలను బాబా భాస్కర్ కూడా లాగేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బాగానే తోపులాట జరిగింది. కాగా ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ ప్రోమోలో అలీ, బాబాలు తీవ్రంగా తోపులాడుకుంటున్నారు. కొంత ఫిజికల్‌ కూడా అయ్యింది. ఒకరిని ఒకరు బలంగా తోపుకుంటూ.. తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదంతా పక్కనే ఉన్న శ్రీముఖి, శివ జ్యోతీ, వరుణ్, రాహుల్.. చూస్తూ.. షాక్‌కు గురైయారు. అయితే ఈ పూల టాస్క్‌లో గెలిచేదెవరో తెలియాలంటే మాత్రం ఈరోజు  ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేదాకా వేయిట్ చూడాల్సిందే..
Recent Post