విజయ్ మూవీకి తమిళనాడు గవర్నమెంట్ షాక్...!

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 05:04 PM

తమిళనాడు గవర్నమెంట్ తలపతి విజయకి పెద్ద షాక్ ఇచ్చింది. బిగిల్ మూవీ ప్రీమియర్ షోస్ అనుమతించబోమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని అతిక్రమించిన ఎవరైనా కఠిన చర్యలకు బాధ్యులు అని అందరికి ఝలక్ ఇచ్చింది. దీనితో తమిళనాడులో బిగిల్ ప్రదర్శన 25వ తేదీ దీపావళి రోజున మార్నింగ్ షో నుండి మాత్రమే ప్రారంభం అవుతుంది. అలాగే రోజుకు కేవలం నాలుగు షోలు మాత్రమే అనుమతిస్తారు. భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న బిగిల్ మూవీ ఈ నిర్ణయంతో ఓపెనింగ్ కలెక్షన్స్ కోల్పోయే అవకాశం కలదు. తమిళనాడు ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కాదంబర్ రాజు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీపావళికి ముందు రోజు అర్థరాత్రి నుండే బిగిల్ మూవీ ప్రదర్శన మొదలుపెట్టాలని చూసిన నిర్మాతలకు ఈ పరిణామం నిరాశకు గురిచేసింది. విజయ్ మూడు విభిన్న పాత్రలలో నటించిన ఈచిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. నయనతార ఈ చిత్రంలో విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది.
Recent Post