ఈ దీపావళికి కూడా మహేష్ పోస్టర్‌...!

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 05:15 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి సాలిడ్ అప్డేట్ వస్తే చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. సినిమా షూటింగ్ దాదాపు ఆఖరి దశలో ఉండటంతో ఈ దీపావళికి చిన్నపాటి గ్లింప్స్ లేదా పాట ఏదైనా వదిలితే బాగుంటుందని భావిస్తున్నారు. కానీ టీమ్ మాత్రం చాలా నిమ్మళంగా వ్యవహరిస్తోంది. అప్డేట్స్ విషయంలో తొందరేమీ లేదంటోంది. పెద్ద పండుగలప్పుడు కూడా చిన్న చిన్న అప్డేట్స్ మాత్రమే అంటున్నారు. మొన్నామధ్య దసరా పండుగకు ఒక పోస్టర్ ఇచ్చినట్టే రాబోయే దీపావళికి కూడా పోస్టర్‌తోనే సరిపెడతారని టాక్. దీంతో అభిమానుల్లో ఒకింత నిరుత్సాహం నెలకొంది. కానీ నవంబర్ సగం నుండి లేదా ఆఖరు నుండి వరుస ట్రీట్స్ ఖాయమని తెలుస్తోంది. పాటలు, టీజర్, క్యారెక్టర్ పోస్టర్స్ ఇలా ఒకదాని వెంట ఇంకొకటి వస్తూనే ఉంటాయట. సో.. మహేష్ అభిమానులకు డిసెంబర్ నుండి గ్యాప్ లేకుండా సప్రైజులే సప్రైజులన్నమాట. ఇకపోతే రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుండగా తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుండగా విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Recent Post