తెనాలి రామకృష్ణ బిఎబిఎల్' సెన్సార్ పూర్తి..

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 08:36 PM

సందీప్ కిషన్ కథానాయకుడుగా హన్సిక కధానాయికగా నటిస్తున్న తాజా చిత్రం 'తెనాలి రామకృష్ణ బీఎబీఎల్'. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమాకు సెన్సార్ పూర్తయ్యింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా పై ఆ చిత్రయూనిట్ భారీ అంచనాలనే పెట్టుకుంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ కు మంచి స్పందన లభించింది. కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హన్సిక కథానాయికగా నటిస్తున్నారు. 
Recent Post