శంషాబాద్‌లో ఫైట్లు చేస్తున్న రూలర్

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 08:43 PM

ఈ ఏడాది  త‌న తండ్రి దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర లో న‌చించిన బాల‌య్య ఆ రెండు సినిమాల రిజల్ట్ ఊహించని విధంగా షాక్ ఇవ్వ‌డంతో  మ‌ళ్లీ యాక్ష‌న్ చిత్రాల‌నే న‌మ్ముకున్నాడు .  కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న రూలర్ సినిమా డిసెంబర్ 20వ తారీఖున విడుదల చేసేందుకు నిర్మాత‌లు సిద్ద‌మ‌వుతున్నారు. కాగా   ఈ సినిమా కోసం బరువు తగ్గిన బాలయ్య … అదరగొట్టే స్టైల్లో అభిమానులను అలరించ‌డంతో పాటు సినిమాని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లాడు.   ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని శంషాబాద్ ప్రాంతంలో జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ ఏకంగా 500 మంది ఫైటర్స్ తో ఒక భారీ పోరాట సీన్ లో పాల్గొంటున్నారని యూనిట్ వ‌ర్గాలు చెపుతున్నాయి.  సినిమాలో ఈ భారీ సీన్ ఒక్క‌టి చాలు అదిరిపోయేలా చేస్తుంద‌ని,  ఫ్యాన్స్ ఈ సీన్ కు థియేటర్స్ లో విజిల్స్ తో అదరగొట్టడం ఖాయమని సినిమా యూనిట్ పేర్కొంది.  
Recent Post