గాయని లతా మంగేష్కర్ కు అస్వస్తత

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 08:51 PM

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ (90) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస ఇబ్బందిగా ఉందని చెప్పడంతో ఇవ్వాళ తెల్లవారు జామున లతాజీని ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రికి తరలించారు. న్యూమోనియాతో పాటు ఎడమ వెంట్రిక్యులర్‌ ఫెయిల్యూర్ కావడంతో వైద్యులు పరీక్షించి చికిత్స చేశారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఇంటికి పంపించారు. కాగా లతా మంగేష్కర్‌ సెప్టెంబర్ 28 న 90వ పుట్టిన రోజు జరుపుకున్నారు.
Recent Post