తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ కి యు / ఎ సర్టిఫికేట్

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 08:59 PM

సుందీప్ కిషన్ కామెడీ చిత్రం తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ తన సెన్సార్ కార్య‌క‌లాపాలు పూర్తి చేసుకుంది.  ఈ చిత్రం క్లీన్ అండ్ నీట్‌గా ఉంద‌ని, అయితే కొన్ని దృశ్యాల‌పై దృష్టి సారించిన సెన్సార్ బోర్డు యు / ఎ సర్టిఫికేట్ అందించింది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని అడ్డంకులను అధిగమించిఈ నెల 15 విడుద‌ల‌వుతున్న‌ట్టు నిర్మాత‌లు చెప్పారు.  ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేషమైన స్పందన లభింస్తుండ‌టంతో  థియేటర్ల వ‌ద్ద ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన టిక్కెట్లు అమ్మ‌కాలు జోరందుకున్నాయి. విడుద‌ల‌కు ముందే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలుక‌లిగించేలా ట్రైల‌ర్ ఉండ‌టంతో ధియేట‌ర్ల‌లో జ‌నం న‌వ్వుల వాన కురియ‌నుంది.  


ఈ చిత్రంలో వెన్నెలా కిషోర్, ప్రభాస్ సీను మరియు సప్తగిరి వంటి హాస్యనటులు   చక్కిలిగింతలు చేస్తారని ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌ర్ రెడ్డి చెప్పారు.  సుందీప్ కిషన్  స‌ర‌స‌న హన్సిక మోత్వానీ  న‌టిస్తుండా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. 
Recent Post