ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆండ్రియా లైఫ్ లో ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు..?

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 11:53 AM



సింగర్ గా కెరియర్ మొదలు పెట్టి హీరోయిన్ గా టర్న్ అయిన తమిళ భామ ఆండ్రియా తన లైఫ్ లో ఒకరితో వివాహేతర సంబందం పెట్టుకున్న విషయాన్ని బట్టబయలు చేసింది. ఆల్రెడీ పెళ్లైన వ్యక్తితో ఆమె అక్రమ సంబందం పెట్టుకుందట. అయితే అతని నుండి దూరంగా ఉన్నాక చాలా ఇబ్బందులు పడ్డానని.. ఆ టైంలో తన మానసిక స్థితి చాలా ఘోరంగా ఉండేదని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఆండ్రియా.


ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం ఆమె చెప్పేందుకు నిరాకరించింది. తన లైఫ్ స్టోరీ గురించి ఆమె ఒక బుక్ రాస్తుందట అందులో అతని పేరుని రివీల్ చేస్తుందట. అయితే ఇప్పటికే ఆ బుక్ రాయడం పూర్తయినా దాన్ని కూడా అతను పబ్లిష్ అవకుండా చేస్తున్నాడట. కోలీవుడ్ లో మంచి పలుకుబడి ఉన్న అతని సినిమా, రాజకీయ రంగాలను ఉపయోగించుకుని అలా చేస్తున్నాడట. మరి ఆండ్రియా బుక్ రిలీజ్ అయితేనే కాని ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరన్నది తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com