ఎట్టకేలకు మాస్ మహారాజా రవితేజ 66వ చిత్రానికి ముహూర్తం కుదిరినట్టేకనిపిస్తోంది. `డాన్‌శీను`, `బలుపు` చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని- రవితేజాల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ హ్యాట్రిక్ మూవీని . సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు ( ఠాగూర్ మధు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 14న ఈ సినిమాను గ్రాండ్ లెవల్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించేంఉకు ముహుర్తం ఖరారు చేసారు.
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రంలో పవర్‌పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ మరోమారు కనిపించనున్నారు. ఈ సినిమా ఓపెనింగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసింది. అందులో ఇన్టెన్స్ బ్యాగ్రౌండ్లో పోలీస్ ఆఫీసర్ డ్రెస్‌లో రవితేజ కనపడుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.