ప్రభాస్ “జాన్” కోసం ఆర్ఎఫ్‌సీలో యూరప్ సెట్

  Written by : Suryaa Desk Updated: Fri, Nov 15, 2019, 09:49 PM

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే క‌థానాయికగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 18న నుండి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జ‌రుపుకోనుంది. “జాన్” అనే టైటిల్‌ ప్ర‌చారంలో ఉన్న ఈ చిత్రాన్ని దాదాపు 180 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. సినిమా కోసం 80ల కాలం నాటి యూర‌ప్ సెట్‌ని ఆర్ఎఫ్‌సీలో రూపొందిస్తున్నార‌ట‌. చిత్ర నిర్మాణ సంస్థ 25 విలాసవంతమైన సెట్లను ఏర్పాటు చేయ‌నుండ‌గా, కొన్ని సన్నివేశాలను మినహాయించి మొత్తం షూట్ ఈ సెట్లలో పూర్తవుతుందని ఇన్‌సైడ్ టాక్.
Recent Post