ఇస్మార్ట్ పాట‌కు 100 మిలియన్లకు పైగా వ్యూస్

  Written by : Suryaa Desk Updated: Fri, Nov 15, 2019, 10:51 PM

పూరి కనెక్ట్స్, పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కంబినేషన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా  సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సాంగ్స్ అన్ని కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ ఏడాది రిలీజ్ అయిన సాంగ్స్ లో ఈ ‘దిమాక్ ఖరాబ్’ సాంగ్ లిరికల్ గా అలానే వీడియో సాంగ్ వ్యూస్ పరంగా, మొత్తం కలిపి 100 మిలియన్లకు పైగా యూ ట్యూబ్ వ్యూస్ దక్కించుకుని, ఇప్పటికీ యూట్యూబ్ లో తిరుగులేకుండా దూసుకుపోతోంది.  ఈ మాస్ సాంగ్, యువతను మరియు మాస్ ఆడియన్స్ ను మరింతగా ఊపేసిందనే చెప్పాలి. ఇకపోతే ఈ సాంగ్ నేడు ఒక అద్భుతమైన రికార్డుని సొంతం చేసుకుంది.


 
Recent Post