ముంబైలోని ఓ ఫిట్నెస్ స్టూడియో నుంచి వస్తూ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఇచ్చిన ఫోజులు హాట్ టాపిక్ గా మారాయి. బుల్లితెర ఫిట్ నెస్ క్వీన్ సోఫీ చౌదరి నిర్వహిస్తున్న `వర్క్ ఇట్ అప్` ఫిట్నెస్ షోలో శిల్పా ఎపిసోడ్ ప్రధానంగా హైలైట్ కానుంది. అందుకు సంబంధించిన షూట్ పూర్తయిన వెంటనే ఆ షోని చిత్రీకరించిన ఫిట్నెస్ స్టూడియో నుంచి వస్తూ శిల్పా కెమెరా కంటికి చిక్కింది. శిల్పా ఆ సమయంలో ఒక టీనేజర్ ని తలపించడమే కాదు.. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా రన్నింగ్ చేస్తూ రకరకాల భంగిమల్లో ఫోజులిస్తూ వేడెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాల్లో జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోతున్నాయి. శిల్పా ధరించిన స్పోర్ట్స్ బ్రాండ్ పై యూత్ ఒకటే ఆరాలు తీస్తున్నారు. అది ఆడిడాస్ బ్రాండా.. నైక్ బ్రాండా లేక రీబాకా అంటూ బోయ్స్ అంతా గుసగుసలాడేసకుంటున్నారు.