'సైరా' అమెజాన్‌ ప్రైమ్‌ ఎప్పుడొస్తుందో తెలుసా?

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 17, 2019, 04:44 PM

మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ డేట్ కోసం బాగా వేచి చూస్తున్నారు. నవంబర్‌లోనే సైరా అమేజాన్ ప్రైమ్ వీడియోలో వస్తుందని అనుకున్నా కూడా అది జరగడం లేదు. ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలై ఇప్పటికే దాదాపు 40 రోజులు దాటేసింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్ర బిజినెస్ పూర్తైపోయింది కూడా. ఇప్పటికే 40 రోజులు గడిచిపోవడంతో ఫైనల్ కలెక్షన్స్ వచ్చేసాయి. అమ్మిన రేటు ప్రకారం చూస్తుంటే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో 106 కోట్ల మార్క్ షేర్‌ను అందుకుంది సైరా నరసింహారెడ్డి. పెరిగిన దసరా సెలవులు నైజాంలో ఈ సినిమాకు బాగానే ఉపయోగపడ్డాయి. మొత్తంగా 240 కోట్ల గ్రాస్.. రూ. 143 కోట్లు షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది సైరా. ఈ చిత్రాన్ని దాదాపు 188 కోట్లకు పైగానే నిర్మాతలు అమ్మినట్లు తెలుస్తుంది. తెలుగులో మాత్రమే సైరా మంచి వసూళ్లు సాధించింది. ఇక్కడ 106 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. ఇక్కడా కూడా కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలను తీసుకొచ్చాడు చిరంజీవి. నైజాం, ఉత్తరాంధ్ర లాంటి ఒకట్రెండు చోట్ల మాత్రమే సైరా బ్రేక్ ఈవెన్ అయి లాభాలు తీసుకొచ్చింది. మిగిలిన చోట్ల నష్టాలు తప్పలేదు. ఇక మిగిలిన భాషల్లో అయితే ‘సైరా నరసింహారెడ్డి’ దారుణంగా నిరాశ పరిచింది. ఓవర్సీస్‌లో అయితే పరిస్థితి మరీ దారుణం. అక్కడ 2.5 మిలియన్ దగ్గరే ఆగిపోయింది ఈ చిత్రం. హిందీలో అయితే కనీస స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది ఈ చిత్రం. ఫుల్ రన్ కలిపితే కనీసం 8 కోట్లు కూడా తీసుకురాలేదు. అక్కడ వార్ సినిమా సైరాపై దారుణంగా దెబ్బేసింది. తెలుగులో కొన్నిచోట్ల మాత్రమే సైరా విజయం అందుకుంది. మిగిలిన చోట్ల మాత్రం చిరంజీవికి కాలం కలిసిరాలేదు. ఇప్పటి వరకు 143 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇంకా చాలా వరకు వెనకబడి ఉంది ఈ చిత్రం. ఎటు చూసుకున్నా కూడా చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కమర్షియల్‌గా నిరాశ పరిచిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ చిత్ర అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల తేదీ కూడా బయటికి వచ్చేసింది. డిసెంబర్ 6న సైరా డిజిటల్ మీడియాలో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మళయాల వర్షన్స్ కూడా అదే రోజు రిలీజ్ కానున్నాయని తెలుస్తుంది. ఇక త్వరలోనే జెమినీ టీవీలో కూడా సైరా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ వేయనున్నారు. మొత్తానికి మెగాభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సైరా కోసం వేచి చూస్తున్నారు.
Recent Post