ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ 3 పార్టీ టైం...

cinema |  Suryaa Desk  | Published : Sun, Nov 17, 2019, 06:03 PM



తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ఆరంభం మరియు క్లైమాక్స్ అధిరింది. మొదటి వారం ఎపిసోడ్స్ కు భారీ రేటింగ్ వచ్చింది. అలాగే ఫైనల్ ఎపిసోడ్ కు కూడా రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చినట్లుగా స్టార్ మా వర్గాల వారు ప్రకటించారు. ఇక బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ కు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రొఫెషన్ లో బిజీ అయ్యారు. అయినా కూడా కొందరు సెలబ్రెటీలు బిగ్ బాస్ 3 రీ యూనియన్ పేరుతో పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో వరుణ్ సందేశ్.. వితిక.. పునర్నవి.. హిమజ.. అలీ మరియు మహేష్ విట్టలు పాల్గొన్నారు. ఈ పార్టీ ఫొటోలను పునర్నవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మిస్ యూ రాహుల్ అంటూ కామెంట్ పెట్టింది. ఈ పార్టీకి రాహుల్ హాజరు కాకపోవడంపై రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి. రాహుల్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న కారణంగా రాలేదంటే కొందరు అంటూ ఉంటే మరికొందరు మాత్రం విభేదాల కారణంగా రాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో పాటలు పడటంతో పాటు పలు న్యూస్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తున్నాడటు. మరో వైపు తనను ఓట్లు వేసి గెలిపించిన అభిమానులను కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తానికి రాహుల్ చాలా బిజీగా ఉన్న కారణంగానే రాకపోయి ఉంటాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ పార్టీలో రాహుల్ ఉండి ఉంటే నిండుతనం ఉండేది. ఎందుకంటే బిగ్ బాస్ లో ఉన్న సమయంలో వరుణ్.. వితిక.. పున్నుతో పాటు రాహుల్ లు ఒక టీంలా ఉండే వారు. ఆ టీంలో ఇప్పుడు రాహుల్ మిస్ అవ్వడం వల్ల ఈ పార్టీలో వెలితి క్లీయర్ గా తెలుస్తుంది. రాహుల్ మాత్రమే కాకుండా ఇంకా పలువురు కంటెస్టెంట్స్ కూడా ఈ పార్టీలో పాల్గొనలేదని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com