రాజకీయాల్లోకి శ్రీరెడ్డి..!!?

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 17, 2019, 06:19 PM

టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో రచ్చరచ్చ చేసిన శ్రీ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కోలీవుడ్ కు వెళ్ళింది. అక్కడే సినిమాలు చేస్తున్నది. అక్కడి ప్రజలు ఆమెను ఆదరిస్తున్నారట. అక్కడ సినిమా అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టుగా చెప్తోంది. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు అన్యాయం జరుగుతుందని వాదించినా తనను ఎవరూ పట్టించుకోలేదని, తనకు అన్యాయం జరిగిందని చెప్పి శ్రీరెడ్డి వాదించింది. అక్కడి నుంచి తమిళనాడు వచ్చి అక్కడ సినిమాలు చేస్తున్న శ్రీరెడ్డి తమిళ్ హీరో, డిఎంకె అధినేత స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పేస్ బుక్ లో కొని వ్యాఖ్యలు చేసినట్టుగా పోస్టింగులు వచ్చాయి.
దానిపై శ్రీరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చింది. ఆ పోస్టింగులు చేసింది తాను కాదని, అది ఫేక్ అకౌంట్ నుంచి పోస్టు అయ్యాయని, తనపై అభాండాలు వేసేందుకే ఇలా చేస్తున్నారని వాపోయింది. తమిళ సినిమా రంగంలో రాణిస్తున్నట్టు చెప్పిన శ్రీరెడ్డి, తనకు కరుణానిధి కుటుంబం అంటే గౌరవం ఉందని, ఉదయనిధి స్టాలిన్ ను డైరెక్ట్ గా ఇప్పటి వరకు కలవలేదని శ్రీరెడ్డి పేర్కొన్నది. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు శ్రీరెడ్డి పేర్కొన్నది. అయితే, ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేస్తోంది..అన్నది తెలియాల్సి ఉన్నది. 
Recent Post