ప్రియుడుతో కలిసి న్యూయార్క్ లో నయన్... నయనతార

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 17, 2019, 06:52 PM

హీరోయిన్ నయనతార తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివ‌న్ న్యూయార్క్ లో కలిసి సందడి చేసారు. గత కొద్ది రోజులు నుండి వీరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. అయితే వీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.. కానీ దీనిపై ఇటు నయన్ అటు విఘ్నేష్ ఎవరు కూడా స్పందించడం లేదు. తాజాగా న్యూయార్క్ లో సందడి చేసిన ఈ జంట అక్కడ కొన్ని ప్రదేశాల్లో ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను విఘ్నేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆమె నా జీవితంలోకి రావడం అదృష్టం అంటూ పోస్ట్ చేసాడు.దీనితో అభిమానులు కూడా వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. సోమవారం (నవంబర్ 18)న నయనతార తన 34 పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా వారు న్యూయార్క్ ని సందర్శించారు. అక్కడ ప్రముఖ నిర్మాత బోని కపూర్ , ఖుషీని కలిశారు. నయనతార తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నయనతార సిద్దమ్మ అనే పాత్రలో నటించింది.
Recent Post