జిమ్‌లో చెమటలు చిందిస్తున్న రష్మిక..

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 17, 2019, 07:03 PM

తెలుగులో అనతి కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన్నా. 'ఛలో' మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ భామ.. "గీతగోవిందం" చిత్రంతో పాపులర్ అయింది. పైగా ఈమె, తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా, టాప్ రేంజ్‌ని అందుకుంది. ఇప్పుడు స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అందుకే సొగసైన బాడీ షేప్ కోసం చెమటలు చిందిస్తోంది. తాజాగా ఈ అమ్మడు జిమ్‌లో చేసిన బ్యాక్ ఫ్లిప్ అందరినీ ఆకట్టుకుంటోంది. నిజానికి రష్మిక ఇప్పటికే నాజూకు సొగసులు ఉన్న ముద్దుగుమ్మ. అయినా జిమ్‌లో చెమటలు చిందించడానికి ఓ కారణం ఉందట. ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ కెరీర్ చాలా కొద్ది రోజులే. వీలైనంత ఫిట్‌గా లేకుంటే కెరీర్ ఎప్పుడైనా ప్రమాదంలో పడిపోవచ్చు. ఆ విషయం గుర్తించే రష్మిక పూర్తి ఫిట్నెస్‌తో ఉండేట్లు జాగ్రత్తలు తీసుకుంటోందట. సమంత లాంటి సీనియర్ హీరోయిన్స్ ఫిట్నెస్ కారణంగానే లాంగ్ టైం కెరీర్ లీడ్ చేస్తోన్నారు. అందుకే ఈ కన్నడ కస్తూరి కూడా అదే బాటలో పయనిస్తోందట. ఇందుకోసం రష్మిక ట్రైనర్ తనవంతు సాయం చేస్తున్నాడట. జిమ్‌లో చెమటలు పట్టేంతవరకు వదిలిపెట్టడం లేదట. మొత్తంమీద రష్మిక కూడా జిమ్‌లో ముమ్మర కసరత్తులు చేస్తోందన్నమాట.
Recent Post