అందుకే బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడమే మానేశా: సుదీప్

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 17, 2019, 07:21 PM

'ఈగ', 'బాహుబలి' సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుదీప్.. రీసెంట్ గా 'పహిల్వాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సుదీప్ కుస్తీవీరుడు, బాక్సర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే సుదీప్ తన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉంటాడు. ఇలా ఎంత క్రేజ్ ఉన్న మీరు బర్త్ డే వేడుకలకు ఎందుకు దూరంగా ఉంటారని ప్రశ్నించగా..తన జీవితం లో జరిగిన ఓ సంఘటనను తెలిపి అందరికి షాక్ ఇచ్చాడు. గతంలో అభిమానులు సుదీప్‌ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు. ఆ వేడుకలో సుదీప్‌ కూడా ఎంజాయ్‌ చేశాడు. అయితే కార్యక్రమం పూర్తయి వెళ్లిపోతుండగా ఓ పాప కిందపడిన కేక్‌ తీసుకొని తింటున్న విషయాన్ని గమనించాడట. ఆ దృశ్యం తనని ఎంతో కలచి వేసిందన్న సుదీప్‌, ఇక జీవితంలో బర్త్ డేను అంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడట. అంతేకాదు తను వ్యక్తిగతం జీవితంలో కూడా ఈ సంఘటన ఎన్నో మార్పులకు కారణమైందన్నాడు సుదీప్‌.
Recent Post