తెలుగు ప్రేక్షకులకి తన పాటలతో కిక్ ఇస్తున్న తమన్

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 17, 2019, 08:40 PM

తమన్ తెలుగు సంగీత దర్శకులలో ఒకరు.. కిక్ సినిమాతో తన ప్రయాణాన్నిమొదలు పెట్టిన తమన్ వరుస సినిమాలతో బిజీగా ఉంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్ .. అయన ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.. తమన్ ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత అయిన ఘంటసాల బలరామయ్య మనవడు.. అయన తల్లి మేనత్త అందరు సంగీత విద్వాంసులు కావడం విశేషం.. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో నటించాడు. ఆ ఆ తర్వాత మణిశర్మ దగ్గర సంగీత శిష్యరికం చేసాడు.ఆ ఆతర్వాత రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమాతో అవకాశం రావడంతో వచ్చిన మొదటి సినిమాని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. వరుస సినిమాలను చేస్తూ విజయాలను అందుకున్నాడు. ఆ తర్వాత ఆంజనేయులు, బృందావనం ,మిరపకాయ్ ,దూకుడు సినిమాలకి మంచి సంగీతం అందించి తెలుగు టాప్ సంగీత దర్శకులలో ఒకరికి నిలుస్తూ వస్తున్నాడు.  ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు తమన్. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఆలా వైకుంఠపురములో, నాగ చైతన్య , వెంకటేష్ హీరోగా వస్తున్న వెంకీ మామ, రవితేజ డిస్కో రాజా సినిమాలు విడుదల కి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఆలా వైకుంఠపురములో నుండి విడుదలైన రెండు పాటలు శ్రోతలను వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తమన్ నేపథ్య గాయని శ్రీవర్ధినిని వివాహం చేసుకున్నాడు. తమన్ ఇలాంటి సినిమాలను మరెన్నో చేస్తూ విజయాలను అందుకోవాలని ఆశిస్తూ తమన్ కి జన్మదిన శుభాకాంక్షలు
Recent Post