విశాఖ అందాలు క‌ట్టిప‌డేస్తున్నాయ‌న్న బాలీవుడ్ బ్యూటీ

  Written by : Suryaa Desk Updated: Mon, Nov 18, 2019, 09:58 PM

త‌ను దేశంలోని ఎన్నో ప్రాంతాల‌లో షూటింగ్‌ల నిమిత్తం తిరిగాన‌ని, ఆయా ప్రాంతాల‌లో క‌ల‌గ‌ని ఆహ్ల‌దం, ఆనందం విశాఖ అందాలు చూశాక క‌లిగింద‌ని, ఇక్క‌డి ప్ర‌కృతిని చూసి మ‌న‌సు ప‌రవ‌శించింద‌ని బాలీవుడ్ న‌టీమ‌ణి అర్షి శ్రీవాత్స‌వ అన్నారు. సోమ‌వారం ఆమె ఓ వాణిజ్య సంస్థ బ్రాండింగ్‌తో పాటు ఓ చిత్రం షూటింగ్ నిమిత్తం  విశాఖ న‌గ‌రానికి విచ్చేసారు. ఈ సంద‌ర్భంగాగూగుల్‌లో బెస్ట్ బ్యూటీఫుల్ సిటీస్‌లో విశాఖ‌ప‌ట్నం చూసిన తాను ఎప్ప‌టి నుండో ఇక్క‌డ‌కు రావాల‌ని అనుకున్నాన‌ని,   బ్రాండింగ్ , సినిమాల‌తో బిజిగా ఉన్న త‌న‌ని  విశాఖ అందాలే ఇటువైపు ర‌ప్పించాయ‌ని ఆనందం వ్య‌క్తం చేసారు. సినిమా షూటింగ్‌ల‌కు విశాఖ ఎంతో అనువైన ప్రాంత‌మ‌ని, బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ల‌తో తాను ఇక్క‌డి సోయ‌గాల‌ను చ‌ర్చించి బాలివుడ్ త‌ర‌ఫున ఇక నుంచి ఈ ప్రాంతంలో ప‌లు చిత్రాల  షూటింగ్‌లు జ‌రిగేలా నిర్మాత‌ల‌కు ఇక్క‌డి అందాల‌ను షేర్ చేస్తాన‌ని అన్నారు.  గ‌త కొంత కాలంగా తెలుగు చిత్రాల్లో న‌టించాల‌న్న త‌న క‌ల రీసెర్చ్ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ద్వారా సాకారం కావ‌డం ఎంతో  సంతోషాన్ని క‌లిగిస్తోంద‌ని వెల్ల‌డించారు.


 


 
Recent Post