రాహు జాతకాల కథ కాదట‌

  Written by : Suryaa Desk Updated: Mon, Nov 18, 2019, 10:01 PM

అభిరామ్‌ వర్మ, కృతిగార్గ్‌ జంటగా సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాహు’. శక్తి బాబ్జి, ఏవీఆర్‌ స్వామి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన దర్శకుడు వీరు పోట్ల మాట్లాడుతూ–‘‘రాహు’ ట్రైలర్‌ బాగుంది’’ అన్నారు. ‘‘ఫిల్మ్‌మేకర్స్, టెక్నీషియన్స్‌ థ్రిల్లర్‌ జానర్‌లో సినిమాలు చేయడానికి బాగా ఇష్టపడతారు. కొత్తగా చేయడానికి వాళ్లకు స్కోప్‌ ఉంటుంది’’ అన్నారు దర్శకుడు బీవీఎస్‌ రవి. ‘‘ప్రస్తుతం థ్రిల్లర్స్‌ యుగం నడుస్తోంది’’ అన్నారు దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌. ‘‘ఈ టైటిల్‌ చూసి జాతకాల స్టోరీ అనుకుంటున్నారు.. కానే కాదు.. హీరోయిన్‌కు ఒక డిజార్డర్‌ ఉంటుంది. ఆ సమస్యపై హీరోయిన్‌ చేసిన పోరాటమే ‘రాహు’’ అన్నారు సుబ్బు. ‘‘మంచి సినిమా నిర్మించామనే సంతృప్తి కలిగింది’’ అన్నారు నిర్మాతలు. అభిరామ్‌ వర్మ, కృతీగార్గ్, సంగీత దర్శకుడు ప్రవీణ్‌ లక్కరాజు, నటుడు చలాకీ చంటి మాట్లాడారు.
Recent Post