నవంబర్‌ 21న జ్యోతిక 'జాక్‌పాట్

  Written by : Suryaa Desk Updated: Mon, Nov 18, 2019, 11:58 PM

జ్యోతిక ప్రధాన పాత్రలో పూర్తిస్థాయి హిలేరియస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం    'జాక్‌పాట్ .  ఈ చిత్రానికి దర్శకుడు కళ్యాణ్‌.పెళ్లి తర్వాత కొన్నేళ్ళు గ్యాప్‌ తీసుకున్న ఈమె ఇప్పుడు మళ్లీ 'జాక్‌పాట్‌'తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ లభించిందని చిత్రబృందం చెబుతుంది. ఇందులో జ్యోతిక, రేవతి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకొనున్నాయని పేర్కొంది. జ్యోతికకు తెలుగులో ఉన్న ఇమేజ్  దృష్టిలో ఉంచుకుని  ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్య నిర్మిస్తున్నారు. యోగి బాబు, ఆనంద్‌ రాజ్‌ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నఈ సినిమాను గీతా ఫిలిం డిష్టిబ్యూషన్స్ నవంబర్‌ 21న విడుదల చేస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత: సూర్య శివకుమార్‌, సహ నిర్మాత: రాజశేఖర్‌ కరూపసుందర పాండియన్‌, సినిమాటోగ్రఫీ: ఆర్‌ఎస్‌ ఆనంద కుమార్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, ఎడిటర్‌: విజరు వేలుకుట్టి.
Recent Post