భాగ్య న‌గ‌రంలో జార్జిరెడ్డి 'రైజ్ యువర్ వాయిస్ ర్యాలీ

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 19, 2019, 12:08 AM

ఉస్మానియాలో మ‌ర‌చిపోలేని విద్యార్ధి నేత పేరు జార్జిరెడ్డి. దశాబ్ధాల క్రితం ఓ విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా,  ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పోరాట హోరు. సమసమాజ స్థాపనే ధ్యేయంగా పోరాటం స‌లిపిన  జార్జిరెడ్డి జీవ‌న ప్రస్థానం ఈ తరానికి, భ‌విష్య‌త్ త‌రానికి తెలిసేలా  తెరకెక్కించారు  దళం ఫేం జీవన్‌ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలో సినీ రంగంలో 'వంగవీటి'గా గుర్తింపు సంపాదించిన సందీప్ మాధవ్ హీరోగా న‌టించారు. ఈ చిత్ర  ప్రమోషన్స్‌లో భాగంగా నగరంలో 'రైజ్ యువర్ వాయిస్' పేరుతో హైదరబాద్‌లో చిత్రబృందం బుల్లెట్ ర్యాలీ నిర్వహించింది. వాస్త‌వానికి నెక్లస్ రోడ్ లో   జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్  జ‌ర‌గాల్సి ఉండ‌గా తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందుకు ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా న‌టుడు, జ‌ప‌సేన పార్టీ అధినేత‌ పవన్ కళ్యాణ్ వ‌స్తార‌ని నిర్వాహ‌కులు త‌మ ద‌ర‌ఖాస్తులో పేర్కిన‌గా  ప‌వ‌న్ అభిమానులు,స్టూడెంట్ యూనియన్లు పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మానికి హాజరయితే  .. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని,  అనుమతి నిరాకరించిన విష‌యం తెలిసిందే.
Recent Post