‘క‌ప‌ట‌ధారి’ మోష‌న్ పోస్టర్ విడుద‌ల

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 19, 2019, 12:30 AM

ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ హీరోగా రూపొందుతున్న సినిమాకు   ‘క‌ప‌ట‌ధారి’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌, మోష‌న్ పోస్టర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ట్విట్టర్ ద్వారా ‘కపటధారి’ మోషన్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్న నాగార్జున చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ ట్వీట్‌కు సుమంత్ స్పందిస్తూ.. ‘‘థ్యాంక్స్ చినమామ’’ అని కామెంట్ చేశారు.  క‌న్నడంలో సూప‌ర్‌ హిట్ అయిన ‘కావ‌లుధారి’ సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. తెలుగు వెర్షన్‌లో సుమంత్‌, నాజ‌ర్‌, నందిత‌, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌ప్రకాశ్‌, సంప‌త్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు.
Recent Post