లోకనాయకుడు.. విశ్వనటుడు కమల్ హాసన్ కు ఓడిశాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. మంగళవారం భువనేశ్వర్ లో సెంచూరియన్ యూనివర్సిటీ ఇవ్వనున్న డాక్టరేట్ అందుకోనున్నారు కమల్ హాసన్. ఈ కార్యక్రమానికి ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ ముఖ్య అతిథిగా వస్తారని తెలుస్తుంది. నవీన్ పట్నాయక్ చేతుల మీదగానే కమల్ హాసన్ కు గౌరవ డాక్టరేట్ అందచేస్తారట.
బాలనటుడిగా తెరంగేట్రం చేసి నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన కమల్ కు ఒడియా యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వడం గొప్ప విషయమని చెప్పొచ్చు. ఈమధ్యనే 65వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కమల్ హాసన్ తన జీవితంలో 60 ఏళ్లు సినిమాల్లోనే గడిపారని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు చేసే కమల్ ఈమధ్య సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తను స్థాపించిన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కమల్ హాసన్.